ఉరుములు, మెరుపులు అంటే భయం అంటున్న మాజీ కెప్టెన్ సతీమణి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2020 5:37 AM GMT
ఉరుములు, మెరుపులు అంటే భయం అంటున్న మాజీ కెప్టెన్ సతీమణి

మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు మన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని. ధోని చివరగా గత ఏడాది తన అంతర్జాతీయ మ్యాచ్ ప్రపంచ కప్ లో ఆడాడు. ఈ ఏడాది ఐపీఏల్ లో తిరిగి పునరాగమనం చేస్తాడు అనుకున్న సమయంలో "కోవిడ్ 19" కారణంగా భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అప్పటి నుంచి ధోని ఇంటికే పరిమితం అయ్యాడు.

సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తాడు మన ధోని. ధోని భార్య సాక్షి మాత్రం చాలా చురుగ్గా సోషల్ మీడియాలో పాల్గొంటూ ఫోటో లు వీడియో లు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కూడా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ధోని తన గారాల పట్టి జివా ను బైక్ మీద కూర్చుపెట్టుకొని చక్కర్లు కొట్టాడు. ఆ సమయంలోనే ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. వాటితో పాటు ఉరుములు,మెరుపులు కూడా మొదలయ్యాయి.

చిన్నతనంలో నాకు ఉరుములు శబ్దం వింటే చాలా భయంగా ఉండేది అని సాక్షి వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే తన కూతుర్ని అడిగింది నీకు ఉరుములు అంటే భయమా? అని, అందుకు జివా నాకు ఉరుములు అంటే ఏమి భయం లేదు అని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ టీం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ లో ధోని గురించి మరి కొన్ని ముచ్చట్లు అభిమానులతో పంచుకుంది.

ధోని కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్ తో ఉండటం నాకు నచ్చలేదు అని సాక్షి చెప్పింది. నా అదృష్టం కొద్దీ నేను ధోనీని ఆ జులపాల జుట్టుతో ఉన్నపుడు కలవలేదు అని కూడా తెలిపింది. ఆ జుట్టుతో ధోనిని చూడటానికి కూడా నాకు ఆసక్తి లేదు అని వాపోయింది. ఇలా సాక్షి తన భర్త ధోని గురించి ఆసక్తికరమైన విషయాలు తరచుగా సామాజిక మాధ్యమంలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Next Story