సీఆర్‌పీఎఫ్ మహిళా యోధురాళ్ల సాహసోపేత గాథ..

By అంజి  Published on  7 March 2020 2:02 PM GMT
సీఆర్‌పీఎఫ్ మహిళా యోధురాళ్ల సాహసోపేత గాథ..

81 ఏళ్లుగా దేశానికి సేవచేస్తున్న సీఆర్‌పీఎఫ్ కీర్తి కిరీటంలో ఎన్నో కలికి తురాయిలు ఉన్నాయి. 1939లో ఒక చిన్న దళంగా ప్రారంభమై, ఈనాడు 246 బెటాలియన్లతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పారామిలటరీ దళంగా నిలిచింది. సాహసానికి, కర్తవ్య దీక్షకు సీఆర్పీఎఫ్ మారుపేరుగా నిలిచింది. 1976 పతకాలతో సీఆర్పీఎఫ్ అత్యధిక పతకాలు గెలుచుకున్న పారామిలటరీ సంస్థగా నిలించింది.

సీఆర్పీఎఫ్‌కి 1986 ఫిబ్రవరి 6 నుంచి తనదైన మహిళా బెటాలియన్ ఉంది. ఇది ఢిల్లీ సమీపంలోని ఝరోడా కలాన్‌లో ఉంది. శ్రీలంకలో ఐపీకేఎఫ్‌లో భాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 2007 జనవరిలో మహిళా బెటాలియన్ ను లైబీరియాలో శాంతి స్థాపన కోసంపంపారు. 1989లో ఏడుగురు మహిళలను ఆఫీసర్లుగా నియమించడం కూడా జరిగింది. ఈ రోజు ఆరు మహిళా బెటాలియన్లు, 15 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్లు ఉన్నాయి. 2017లో నక్సల్ సమస్యను ఎదుర్కొనేందుకు బస్తరియా బెటాలియన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 33 శాతం మంది మహిళలు ఉన్నారు.

CRPF female warriors

మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు సాహసంలో, ధైర్యంలో, తెగువలో ఎవరికీ తక్కువ కాదు. 1990 నాటికే ఈశాన్య భారత్ వంటి సంక్లిష్టమైన ప్రదేశంలో మహిళా జవాన్లను మొహరించడం జరిగింది. వారు జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులను జమ్మూ కశ్మీర్, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళా జవాన్లు కర్తవ్య దీక్షలో ప్రాణాలను సైతం అర్పించారు. అందులో ముఖ్యంగా కానిస్టేబుల్ కమలేశ్ కుమారి పార్లమెంటుపై దాడిని వమ్ముచేయడంలో కీలకపాత్ర వహించారు. ఈ ప్రయత్నంలోనేఏ ప్రాణాలర్పించారు. ఆమెకు మరణానంతరం అశోక చక్రను ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ రేఖా కుశ్వాహా, కానిస్టేబుల్ బిందా కుమారి లు కూడా విధ్యుక్తధర్మ నిర్వహణలో ప్రాణాలర్పించారు. ఐపీకేఎఫ్ కు వ్యతిరేకంగా పోరాడిన బిమలా దేవీకి సేనా మెడల్ ఇవ్వడం జరిగింది. అద విధంగా సంతో దేవి కి రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో సీ ఆర్ పీ ఎఫ్ మహిళా జవాన్లు మోటర్ సైకిల్ పై చేసిన సాహసోపేత విన్యాసాలను ప్రపంచమంతా చూసి అచ్చెరువొందింది. అసలు మోటర్ సైకిల్ నడపడమే రాని సుజాత, సంగీత, దీపాలి, మీనా చౌదురి, కట్కె లత వంటి వారు చేసిన సాహసం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

ఆటల్లోనూ ముందంజ..

సీఆర్ పీ ఎఫ్ మహిళా జవాన్లు ఆటల్లోనూ ముందంజలో ఉన్నారు. కమాండెంట్ కుంబురాణి దేవి వెయిట్ లిఫ్టింగ్ లో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆమె 1989 నుంచి 2005 మధ్యకాలంలో రెండు బంగారు పతకాలను, 18 రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆమెకు అర్జున అవార్డు 1990 లో, రాజీవ్ ఖేల్ రత్న 1996 లో, పద్మ శ్రీ 2004 లో లభించాయి. సీఆర్పీఎఫ్ కు చెందిన పదహారుగురు మహిళా క్రీడాకారిణులు అర్జున అవార్డును గెలుచుకున్నారు. అందులో కుంజురాణి దేవి, డబ్ల్యు సంధ్యారాణి, శిల్పీ సింగ్, గీతారాణి, అనితా చాను, సనమాచా చానులు ఉన్నారు. సీనియర్ జాతీయ ఈత పోటీల్లో, కామన్వెల్త్ గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్న రిచా శర్మ, 2006 కామన్వెల్త్ గేమ్స్ లో వెండి పతకం గెలుచుకున్న ఆషిక్ బీబీ, వరల్డ్ పోలీస్ గేమ్స్ లో వెండి పతకాలు గెలుచుకున్న సల్మా ఎంసీలు కూడా సీఆర్పీఎఫ్ నుంచి తయారైన క్రీడా ప్రతిభలే.

CRPF female warriors

సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల పిల్లల కోసం క్రెష్ ల ఏర్పాటు, క్లిష్టతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి పిల్లలను చూసుకునే ఏర్పాటు, ప్రయాణ సమయంలో వాష్ రూమ్‌ల వ్యవస్థ, పూర్తి శరీరానికి భద్రతను కల్పించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మహిళా యోథురాళ్లు తమ విధులను సాహసోపేతంగా నిర్వర్తిస్తున్నారు.

Next Story