ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

Youth self immolates, dies. యువకుడు డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం ఉదయం

By Medi Samrat  Published on  25 April 2022 3:07 PM IST
ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

యువకుడు డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం ఉదయం పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండలంలో చోటుచేసుకుంది. లవ్ ఫెయిల్యూర్ కారణంగా అత‌డు డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో యువతి ఇంటి ముందు యువకుడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే యువ‌కుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన గాలీ సందీప్ ది వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా చెన్నారావుపేటలోని పాపయ్యపేట‌ గ్రామంగా పోలీసులు గుర్తించారు. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story