ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

Youth found hanging in Nalgonda. న‌ల్గొండ‌ పట్టణంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో మహ్మద్‌ అఖిల్‌ (21) అనే యువకుడు

By Medi Samrat  Published on  31 Jan 2023 9:15 PM IST
ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
న‌ల్గొండ‌ పట్టణంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో మహ్మద్‌ అఖిల్‌ (21) అనే యువకుడు మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో పనిచేస్తున్న అఖిల్‌.. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి అఖిల్ తల్లిదండ్రులను రూ.2 లక్షలు అడిగాడు. ఆ మొత్తాన్ని సమకూర్చడంలో తల్లిదండ్రులు విఫలమవడంతో ఉరివేసుకుని చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని తండ్రి మహ్మద్‌ రబ్బానీ ఫిర్యాదు మేరకు నల్గొండ టౌన్‌-2 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story