ఆన్‌లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టం కలిగిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు గురువారం హయత్‌నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని సూర్యనగర్‌కు చెందిన అఖిలేష్‌రెడ్డి (24) బీటెక్ పూర్తి చేశాడు. మంచి రాబడుల కోసం ఆన్‌లైన్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు.
ఇటీవల, అతను కొనుగోలు చేసిన చాలా షేర్లు నష్టాన్ని మిగిల్చాయి. అతనికి దాదాపు రూ. 25 లక్షల వరకు నష్టం కలిగింది దీంతో మనస్తాపం చెంది కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో జరిగిన నష్టమే అతని మృతికి కారణమని సూసైడ్ నోట్ కూడా దొరికింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది భారీగా డబ్బును కోల్పోతూ ఉన్నారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పలేక, అప్పులు కట్టలేమన్న భయంతో ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు.