మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

Youngster from Hyderabad killed in road accident in Medak. మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

By Medi Samrat  Published on  2 April 2023 5:33 PM IST
మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలో మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. రంగారెడ్డి జిల్లా మణికొండ శివపురి కాలనీకి చెందిన మహమ్మద్ అతిర్ ఖాన్, మరో యువతీతో కలిసి మెదక్ లో తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కు శనివారం హాజరయ్యారు. వారిద్దరూ ఆదివారం తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా కిష్టాపూర్ శివారులో మల్లన్న గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కార్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహమ్మద్ అతిర్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. మహిళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన మహిళను 108 సాయంతో మెదక్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story