ఫేస్ బుక్ లో మెసేజ్ చేస్తుంది.. ప్రేమ వల విసురుతుంది
Young women used to trap youth through FB. ఫేస్‌బుక్‌లో ఓ యువతి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది.. ఆ తర్వాత ప్రేమ వల విసురుతుంది..
By Medi Samrat Published on 30 Jan 2022 12:28 PM GMTఫేస్‌బుక్‌లో ఓ యువతి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది.. ఆ తర్వాత ప్రేమ వల విసురుతుంది.. ఆమె మాయలో పడి ఉన్నదంతా సమర్పించే వాళ్లు ఎంతో మంది. అలా చాలా మంది మగవాళ్ళను మోసం చేసిన ఓ యువతిని ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితురాలు తాను UK, UAE లేదా ఇతర దేశాల పౌరురాలిగా చెప్పుకుంది. బాధితుల దగ్గర నుండి ఖరీదైన బహుమతులు తీసుకునేది. నిందితురాలిని 29 సంవత్సరాల యువతిగా గుర్తించారు. నిందితురాలు వద్ద నుంచి 13 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు, ఒక వైఫై పరికరంతో పాటు ఆరు ఫేస్‌బుక్, 1 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం మెహక్ 100 మందికి పైగా మోసం చేసినట్లు తెలిపారు.
బురారీ నివాసి అయిన ధర్మరాజ్ హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ పోర్టల్‌లో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఉత్తర జిల్లా డిప్యూటీ కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. గత కొద్దిరోజులుగా తన ఫేస్‌బుక్ ఖాతాలో అమర్ గుజ్రాల్ అనే మహిళ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ కోసం రిక్వెస్ట్ పంపిందని బాధితుడు తెలిపాడు. ధర్మరాజ్ ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు. కొన్ని రోజుల తరువాత, ఆమె అతనితో చాట్ చేయడం ప్రారంభించింది. ఆమె తనను తాను UK నివాసిగా పేర్కొంది. త్వరలో ఢిల్లీకి రావాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె UK నంబర్‌తో చాటింగ్ చేస్తూనే ఉంది.
ఈలోగా ఢిల్లీ వచ్చేందుకు బాధితుడు వాట్సాప్ ద్వారా విమాన టిక్కెట్లు కూడా పంపింది. త్వరలో కలుద్దామని అతడితో ఆమె మాట్లాడింది. ఆమె ఢిల్లీకి రావాల్సిన.. అదే రోజు మరో మహిళ నుంచి ధర్మ రాజ్ కు ఫోన్ వచ్చింది. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారినని చెప్పాడు. అమర్ గుజ్రాల్ భారీగా డబ్బు, బహుమతులతో వచ్చానని చెప్పింది. ఆమె వద్ద భారతీయ కరెన్సీ లేదు, 34 వేల రూపాయలు చెల్లించాలని తెలిపింది. ధర్మరాజు నిందితురాలు చెప్పిన ఖాతాలో డబ్బులు వేసాడు. ఆ తర్వాత మళ్లీ అతడి నుంచి 50వేలు డిమాండ్ చేశారు. బాధితుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె అతడిని ఫేస్‌బుక్‌లో బ్లాక్ చేసింది. మోసాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ దలాల్, ఎస్‌ఐ రోహిత్ సరస్వత్ బృందం విచారణ ప్రారంభించింది. ఆమెపై ప్రత్యేకంగా నిఘా పెట్టి అధికారులు అరెస్ట్ చేశారు.