ప్రేమించి పెళ్లి చేసుకుని కేవలం మూడు రోజులే.. ఇంతలో అమ్మాయి హత్య

Young Woman was killed three days after married in kodagu. మూడు రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు

By M.S.R
Published on : 15 March 2023 6:55 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకుని కేవలం మూడు రోజులే.. ఇంతలో అమ్మాయి హత్య

మూడు రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన మూడు రోజులకే కొడగులోని ఓ నవ వధువు అనుమానాస్పదంగా హత్యకు గురైంది.హత్యకు గురైన యువతిని అక్షత (18) గా గుర్తించారు. హేమంత్ అక్షతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు, వేర్వేరు కులాలకు చెందిన వారు.

హేమంత్ తల్లిదండ్రులు దశరథ, గిరిజ ఇద్దరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో హేమంత్‌ తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ఆరోపిస్తూ వస్తున్నారు. దళిత యువతి కావడంతో అక్షతను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కుశాలనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మృతదేహాన్ని కుశాలనగర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు.


Next Story