కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!

అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.

By -  Medi Samrat
Published on : 13 Oct 2025 9:24 PM IST

కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!

అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. అనంతగిరి మండలం కరాయిగూడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల కే శాంతి పశువులను కాసేందుకు వెళ్లింది. పశువులను కాస్తుండగా ఒక్కసారిగా కందిరీగలు ఆమెపై విరుచుకుపడ్డాయి. విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో శాంతి తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన శాంతిని గుర్తించిన గ్రామస్తులు ఆమెను వెంటనే అరకులోయ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు శాంతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినా ఆమెను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ శాంతి తుది శ్వాస విడిచింది. శాంతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Next Story