కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి యువతి ఆత్మహత్య

Young woman committed suicide by jumping from Durgam Cheruvu cable bridge. మాదాపుర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 13 July 2023 8:49 PM IST

కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి యువతి ఆత్మహత్య

మాదాపుర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి జూబ్లీహిల్స్‌లో ఓ ఇంట్లో హౌస్ మెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. మాదాపుర్ లోని డీ మార్ట్ లో తన మిత్రురాలుతో షాపింగ్ చేసిన యువతి.. కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చి నేరుగా కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన యువ‌తిని కర్ణాటక రాష్ట్రం గుల్భార్గా రాష్ట్రానికి చెందిన పాయల్(17) గా పోలీసులు గుర్తించారు. జాబ్ నిమిత్తం పాయ‌ల్‌ నాలుగు నెలల క్రితం హైదరాబాదు నగరానికి వచ్చింది. స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నడుస్తూ ఒక్కసారిగా పైనుండి దుర్గం చెరువులోకి దూకింది. అది గమనించిన పాయల్ స్నేహితురాలు వెంటనే ఆమెను అపే ప్రయత్నం చేసింది. కానీ అంతలోనే చెరువులోకి దూకింది. వెంట‌నే పాయ‌ల్‌ స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. యువ‌తి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల‌ కారణాలు తెలియాల్సివుంది.


Next Story