ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.

By Medi Samrat
Published on : 4 Sept 2025 8:15 PM IST

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది. తాను ప్రేమించిన కానిస్టేబుల్ తన ప్రేమను తిరస్కరించడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

శివ్వంపేట మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన సక్కుబాయి (21) ఒక ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఆమె కొంతకాలంగా సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దూ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల సిద్దూ ఆమె ప్రేమను నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సక్కుబాయి, మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారంమృతి చెందింది.

Next Story