ప్రియురాలి గొంతుకోసి హత్యచేసిన ప్రేమోన్మాది
Young Man stabs Woman Rejecting His Proposal. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించందనే నెపంతో ప్రియురాలి గొంతుకొసి
By Medi Samrat Published on
9 Nov 2021 2:38 PM GMT

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించందనే నెపంతో ప్రియురాలి గొంతుకొసి హత్యచేశాడు ఓ ప్రేమోన్మాది. పట్టణంలోని ఎయిట్ ఇంక్లైన్ కాలనీలో జరిగింది ఘటన. వివరాళ్లోకెళితే.. కేకే నగర్ కు చెందిన గొడుగు అంజలి అనే యువతి.. తారకరామారావు నగర్ కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేఫథ్యంలో అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురిచేసేవాడు.
ఈ విషయమై రెండు సార్లు పెద్దమనుషుల పంచాయతీ కూడ జరిగింది. ఈ నేఫథ్యంలోనే ఇంట్లో ఎవరిలేని సమయంలో.. రాజు ఇంట్లోకి చొరబడి విఛక్షణారహితంగా అంజలి గొంతును కోసాడు. తీవ్రరక్తస్రావంలో కొట్టుమిట్టాడిన అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story