ఆ యువ‌తికి నెల క్రిత‌మే పెళ్లి ఫిక్స్ అయింది.. గొడ్డలితో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. శివాజీ నగర్‌లో నడిరోడ్డుపై శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో యువతి అలేఖ్యపై దాడికి తెగబడ్డాడు

By Medi Samrat  Published on  8 Feb 2024 4:45 PM IST
ఆ యువ‌తికి నెల క్రిత‌మే పెళ్లి ఫిక్స్ అయింది.. గొడ్డలితో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. శివాజీ నగర్‌లో నడిరోడ్డుపై శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో యువతి అలేఖ్యపై దాడికి తెగబడ్డాడు. ఆ యువతి స్పాట్‌లోని ప్రాణాలు కోల్పోయింది. అలేఖ్యపై దాడి చేస్తుండగా.. అడ్డొచ్చిన ఆమె వదిన, మూడేళ్ల కుమారడిపై కూడా ప్రేమోన్మాది శ్రీకాంత్ దాడికి దిగాడు. వారికి కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితడు అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి శ్రీకాంత్ ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రీకాంత్ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అక్కడికక్కడే మృతి చెందింది. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్‌ కాపు కాసి ఈ దాడి చేశాడు.

Next Story