రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు

రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

By -  Medi Samrat
Published on : 15 Sept 2025 7:12 PM IST

రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు

రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. కోమాలోకి వెళ్లిన అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తాడూరు మండల పరిధిలోని వెంగంపల్లి గేటు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన యువకుడు సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. హైవేపై నాగర్ కర్నూల్ నుండి కల్వకుర్తి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంను గమనించలేదు. వేగంగా ఢీకొట్టగా ఎగిరి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడు కోమాలోకి వెళ్లినట్లు యంగంపల్లి గ్రామస్తులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

Next Story