బుల్లెట్ బండి ఈఎంఐలు చెల్లించలేదని సీజ్‌ చేసిన‌ ఫైనాన్స్ కంపెనీ.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

Young man ends life after finance company seizes his bike in Vijayawada. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్‌ బండి ఈఎంఐలు చెల్లించలేదని కంపెనీ సీజ్‌

By Medi Samrat
Published on : 24 April 2022 3:40 PM IST

బుల్లెట్ బండి ఈఎంఐలు చెల్లించలేదని సీజ్‌ చేసిన‌ ఫైనాన్స్ కంపెనీ.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

తాను ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్‌ బండి ఈఎంఐలు చెల్లించలేదని కంపెనీ సీజ్‌ చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకివెళితే.. కొత్తపేట కోమల విలాస్‌కు చెందిన బెహరా లక్ష్మి, సోమేశ్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా కొంతకాలంగా దంపతులు విడివిడిగా ఉంటున్నారు.

లక్ష్మి కూలి పని చేస్తుండగా, తల్లితో కలిసి ఉంటున్న కుమారుడు కార్తీక్ అలంకరణ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం, కార్తీక్ తల్లి తన నగలను విక్రయించి, రూ. 50,000 డౌన్ పేమెంట్‌తో తన కొడుకు కోసం బుల్లెట్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈఎంఐలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది శుక్రవారం వచ్చి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెబుతూ రాత్రంతా కుంగిపోయాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story