పిడుగు పడి యువకుడు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పాకల గూడెం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావతు పాషా, కాంతమ్మల దంపతుల రెండోవ కుమారుడు మహేష్ (35) గ్రామ సమీపంలో గేదెలు మేపుతుండగా ఒక్కసారిగా వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్ళాడు. అదే సమయంలో ఆకాశం నుంచి పిడుగు సమీపంలో పడింది.
ఒక్కసారిగా మహేష్ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మహేష్ మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన పై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.