తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 21 ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తూ వేడి రసం ఉన్న పాత్రలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాలేజీలో చదువుకుంటున్న సదరు విద్యార్థి.. పార్ట్ టైమ్ జాబ్ లో భాగంగా క్యాటరింగ్ కంపెనీ పని చేస్తూ ఉన్నాడు. పలు ఈవెంట్లలో ఆ యువకుడు వడ్డించే పనులు చేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ పెళ్లిలో పని చేస్తూ ఉండగా.. ఉడుకుతున్న రసం పాత్రలో పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించారు.
వివాహ వేడుకకు హాజరైన అతడు అతిథులకు భోజనం వడ్డిస్తూ ఉన్నాడు. వేడి వేడి రసం ఉన్న పాత్రలో అతడు పడిపోయాడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని తిరువళ్లూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అతడిని వైద్యులు కాపాడలేకపోయారు. అతడు చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న మరణించాడు.