వివాహిత బెదిరింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

Young Man Committed For Suicide. వివాహిత వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో

By Medi Samrat
Published on : 13 May 2023 3:23 PM IST

వివాహిత బెదిరింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

వివాహిత వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రాయదుర్గానికి కుత్తీష్‌ అలియాస్‌ పృథ్వీ న్యూడిల్స్ పాయింట్ నడుపుతూ ఉన్నాడు. అతడికి గతంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో సన్నిహిత సంబంధం ఉంది. సన్నిహితంగా ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. వాటిని వినియోగించి ఆమె బెదిరింపులకు దిగుతోందని కుత్తీప్ గతంలో కేసు పెట్టాడు. ఆమె కూడా అతడు ఇబ్బంది పెడుతున్నాడని అతనిపై కంప్లైంట్ చేసింది. కొద్ది రోజుల క్రితం వివాహిత జిల్లా ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇరువురుని పిలిచి విచారించారు. శనివారం మరోసారి విచారణకు రావాలన్నారు. గురువారం రాత్రి ఆ మహిళ కుత్తీష్‌కు కాల్ చేసి తన ఇంటికి రావాలని కోరింది. అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో మరొక వ్యక్తిని పంపింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లాడు కుత్తీష్‌. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తన భార్య లలితకు చెప్పాడు. ఆమె వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని భార్య చెప్పింది. చుట్టాల పెళ్లి ఉండడంతో ఉరవకొండకు వెళ్లి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భార్య కుత్తీష్‌కు సూచించింది. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు పయనమైంది. ఆమె పెళ్ళికి వెళుతూ ఉండగా.. తన భర్త ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారంతో వచ్చింది. వివాహిత వేధింపుల కారణంగా తన భర్త చనిపోయాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.


Next Story