అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొత్తగూడెం వంతెన సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడు, యువతి మృతదేహాలు వివస్త్రలుగా కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కవాడిగూడకు చెందిన యశ్వంత్, జ్యోతిగా గుర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యువతి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే హోండా యాక్టివాను గుర్తించిన పోలీసులు జంట హత్యలపై తదుపరి విచారణ చేపట్టారు.