రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు

YCP MLA's son injured in road accident. తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కా

By అంజి  Published on  2 March 2022 12:27 PM IST
రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుండి అమలాపురం వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమారుడు సుమంత్‌ ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ పెద్ద కుమారుడు సుమంత్‌, వారి మేనల్లుడు లోకేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హైవే మొబైల్‌ వాహన సిబ్బంది గమనించి వారిని యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తదనంతరం మెరుగైన వైద్యం కోసం యానాం నుండి కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మేనల్లుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Next Story