దొంగిలించిన ఫోన్‌లో ప్రైవేట్ వీడియో.. సోష‌ల్‌మీడియాలో షేర్ చేయ‌డంతో..

దొంగిలించిన ఫోన్ నుండి ఒక జంటకు సంబంధించిన సన్నిహిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on  28 Dec 2024 1:38 PM IST
దొంగిలించిన ఫోన్‌లో ప్రైవేట్ వీడియో.. సోష‌ల్‌మీడియాలో షేర్ చేయ‌డంతో..

దొంగిలించిన ఫోన్ నుండి ఒక జంటకు సంబంధించిన సన్నిహిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ లోని వాల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి షాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తనకు, తన మాజీ భర్తకు సంబంధించిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో ప్రసారం చేశారని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. తన మాజీ భర్త ఫోన్‌లో ఉన్న తన వీడియో ఒక సంవత్సరం క్రితం దొంగిలించారని ఆ మహిళ చెప్పింది.

2012లో వివాహం చేసుకున్న ఈ జంట వివాదాల నేపథ్యంలో 2017లో చట్టబద్ధంగా విడిపోయారు. వీరిద్దరూ 2020లో మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుండి షాపూర్‌లో కలిసి నివసిస్తున్నారు. వీరికి 14 నెలల కుమారుడు ఉన్నాడు. 2022లో ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.జనవరి 13, 2023న, గాలిపటాలు కొనడానికి మార్కెట్‌కి వెళ్లిన సమయంలో ఫోన్ దొంగిలించారు. అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదట. అయితే 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియో గురించి ఆమెకు తెలిసింది. దీంతో ఈ సమస్యను సైబర్ హెల్ప్‌లైన్ కు తెలియజేసారు.

Next Story