బెడ్‌షీట్ల మ‌ధ్య మ‌హిళ మృత‌దేహం.. దేశ రాజ‌ధానిలో ఆమెను ఎప్పుడు చంపారో..

Woman's Body Found Wrapped in Bed Sheet Inside Bedbox in Locked South Delhi Flat. దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హిలో ఓ మహిళ తాను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో శవమై కనిపించింది.

By Medi Samrat  Published on  28 April 2023 7:17 PM IST
బెడ్‌షీట్ల మ‌ధ్య మ‌హిళ మృత‌దేహం.. దేశ రాజ‌ధానిలో ఆమెను ఎప్పుడు చంపారో..

దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హిలో ఓ మహిళ తాను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో శవమై కనిపించింది. శుక్రవారం నాడు ఓ మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసు అధికారులు తెలిపారు. మృతురాలిని నైజీరియాకు చెందిన ఒబినోజ్ అలెగ్జాండర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ఉంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు తాళం వేసి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కీ మేకర్ సాయంతో ఫ్లాట్ ను ఓపెన్ చేశారు. శరీరాన్ని బెడ్‌షీట్‌లతో చుట్టారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఫ్లాట్ యజమాని రవీందర్ సెహ్రావత్ మాట్లాడుతూ.. 2021 డిసెంబర్‌ నుండి నైజీరియా దేశస్థురాలైన ఒబినోజ్ అలెగ్జాండర్‌కు అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు.


Next Story