బ్యాగ్ నుండి రక్తం కారడాన్ని చూసిన జనం.. తెరచి చూస్తే దీప

చెన్నైలో పోలీసులు సూట్ కేసును తెరచి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు

By Medi Samrat  Published on  19 Sept 2024 2:57 PM IST
బ్యాగ్ నుండి రక్తం కారడాన్ని చూసిన జనం.. తెరచి చూస్తే దీప

చెన్నైలో పోలీసులు సూట్ కేసును తెరచి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు బ్యాగ్ నుండి రక్తం కారడాన్ని గమనించి తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మణిగా గుర్తించారు. అతను సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్న ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఉంటున్నాడు. సూట్‌కేస్‌లో విగతజీవిగా కనిపించిన మహిళను మాధవరంకు చెందిన దీపగా గుర్తించారు.


చెన్నైలోని కుమరన్ కుడిల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తొరైపాక్కం ప్రాంతంలో పడి ఉన్న సూట్‌కేస్ గురించి తెల్లవారుజామున 5.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ కూడా జరుగుతోంది. చెన్నైలో గత కొన్ని నెలలుగా వరుస హత్యలు జరుగుతూ ఉండడం ప్రజలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి.

Next Story