వాగులో కొట్టుకుపోయిన మహిళ

Woman washed away in stream in Dummugudem mandal. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పర్ణశాల సమీపంలోని

By Medi Samrat
Published on : 8 July 2022 10:00 PM IST

వాగులో కొట్టుకుపోయిన మహిళ

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం పర్ణశాల సమీపంలోని సీతానగరం వద్ద గుబ్బలమంగి వాగులో శుక్రవారం 55 ఏళ్ల మహిళ కొట్టుకుపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చేపలు పట్టేందుకు వాగులోకి ప్రవేశించారు. వారు చేపల వేటలో నిమగ్నమై ఉండ‌గా నీటి మట్టం, వ‌ర‌ద‌ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

ఒక్క‌సారిగా గ‌మ‌నించి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రవాహంలో ఉన్న ఓ చెట్టు కొమ్మ‌ల‌ను పట్టుకున్నారు, ఈ సమయంలో స్థానికులు వారిలో ముగ్గురిని తాళ్లను ఉపయోగించి రక్షించారు, అయితే దుర‌దృష్ట‌వశాత్తు ఓ మహిళ కొట్టుకుపోయింది. వ‌ర‌ద‌ ప్రవాహం భారీ ఉండ‌టం.. రాత్రి అవ‌డంతో మ‌హిళ కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌లేదు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.











Next Story