ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Woman throws two sons into well. హ‌న్మ‌కొండ జిల్లాలోని దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో

By Medi Samrat  Published on  12 Feb 2023 6:43 PM IST
ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

హ‌న్మ‌కొండ జిల్లాలోని దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఆదివారం ఓ మహిళ తన ఇద్దరు కుమారులను వ్యవసాయ బావిలో ప‌డేసి.. ఆపై త‌ను కూడా బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో తల్లి, చిన్న కొడుకు మృతి చెందగా, పెద్దబ్బాయిని స్థానికులు రక్షించారు. మామిడి కుమార స్వామి భార్య మామిడి కావ్య (32), వారి కుమారుడు శశిధర్ (7) మృతి చెందగా, పెద్ద కుమారుడు విద్యాధర్ పంపుసెట్ పైపు పట్టుకుని సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు తాళ్లతో రక్షించారని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే కావ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. దామెర పోలీసులు బావిలోంచి మృతదేహాలను వెలికితీశారు. విచారణ కొనసాగుతోంది.


Next Story