దారుణం.. భర్తతో గొడవపడి.. పసికందును బావిలో పడేసిన తల్లి

Woman throws baby into well after fight with husband in Odisha. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన రెండు నెలల కుమారుడిని బావిలో పడేసి చంపేసింది. నీటిలో మునిగి పసికందు

By అంజి  Published on  4 Jan 2022 6:18 PM IST
దారుణం.. భర్తతో గొడవపడి.. పసికందును బావిలో పడేసిన తల్లి

ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన రెండు నెలల కుమారుడిని బావిలో పడేసి చంపేసింది. నీటిలో మునిగి పసికందు మృతి చెందాడు. ఈ కేసులో నిందితురాలు 24 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం నాడు రాత్రి మర్సాఘై పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన భర్తతో గొడవపడి, ఆవేశంతో తన పసికందును బావిలో పడేసి తన బిడ్డను చంపినట్లు వెల్లడించింది. నిందితురాలిని లక్ష్మీప్రియ పరిదాగా గుర్తించారు.

మహిళ భర్త సత్యరంజన్ పరిదా గత రెండేళ్లుగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆరోజు రాత్రి భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యలపై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన లక్ష్మీప్రియ తన బిడ్డను బావిలో పడేసింది. మరుసటి రోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య విబేధాలే తన బిడ్డను విసిరేయడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితురాలిని ఐపిసి సెక్షన్ 302, 201 కింద అరెస్టు చేసినట్లు మార్షఘై పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ పికె కనుంగో తెలిపారు. కుమారుడిని హత్య చేసేందుకు మహిళను ప్రేరేపించిందనే కోణంలో విచారణ జరుగుతోంది.

Next Story