సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Woman techie dies by suicide in Shamshabad. శంషాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది.

By Medi Samrat  Published on  11 Jun 2023 6:33 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

శంషాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన జి సౌందర్య (25) ఎంఎన్‌సి కంపెనీలో పనిచేస్తుండగా.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన అభినవ్‌తో 2022 డిసెంబర్‌లో వివాహం జరిగింది. మహారాష్ట్రలో ఉంటున్న తన భర్తకు సుదూర ప్రాంతానికి వెళుతున్నానని సౌందర్య గురువారం రాత్రి ఫోన్ చేసి కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. మళ్ళీ ఆమె కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ చేసి శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఐదవ అంతస్తు నుండి దూకి తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు అభినవ్‌కి చెప్పింది. అది విని కంగారుపడిన అభినవ్.. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మహిళ భవనంపై నుంచి దూకి గాయపడింది. సౌందర్యను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. “అభినవ్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిన‌ట్లు అభినవ్, బంధువులు చెప్పారు. తనకు కొన్ని బంధుత్వ సమస్యలు ఉన్నాయని, బతకడం ఇష్టం లేదని ఆమె తన స్నేహితులకు, సన్నిహితులకు కూడా చెప్పింద‌ని శంషాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story