విశాఖ బీచ్‌లో గర్భవతి మృతదేహం.. దారుణ‌మైన స్థితిలో..

Woman suspected death in ymca beach at vizag. విశాఖ వైఎంసీఏ సమీపంలోని బీచ్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది.

By M.S.R
Published on : 26 April 2023 12:31 PM

విశాఖ బీచ్‌లో గర్భవతి మృతదేహం.. దారుణ‌మైన స్థితిలో..

విశాఖ వైఎంసీఏ సమీపంలోని బీచ్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి వైఎంసీఏ మూడో పట్టణ పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన యువతి మృతదేహంపై కనీసం బట్టలు కూడా లేకపోవడం సంచలనంగా మారింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో యువతి మృతదేహం పెద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. మృతురాలు 5 నెలల గర్భవతి అని నిర్ధారించారు. మృతురాలు శ్వేత భర్త స్పందించారు. శ్వేతను తాను వేధించలేదని, ఆమెతో ఫోన్ మాట్లాడుతుండగా స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుకోవాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. కడుపులో ఉన్న బిడ్డకోసమైనా ఆలోచించాల్సిందని భర్త మణికంఠ చెప్పుకొచ్చారు. ఈ కేసుపై విశాఖ ఈస్ట్ ఏసీపీ మాట్లాడుతూ మృతురాలు మృతదేహంపై ఎలాంటి గాయాలులేవని అన్నారు. సూసైడ్ నోట్‌పై న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


Next Story