పెళ్లి చేసుకోవాలంటు వేధించాడు.. ఆమె ఏం చేసిందంటే?

Woman Suicide In Suryapet. ప్రతిరోజు వార్తలలో మనం ఎన్నో సంఘటనలను చూస్తూ ఉంటాం

By Medi Samrat  Published on  16 Dec 2020 1:32 PM GMT
పెళ్లి చేసుకోవాలంటు వేధించాడు.. ఆమె ఏం చేసిందంటే?

ప్రతిరోజు వార్తలలో మనం ఎన్నో సంఘటనలను చూస్తూ ఉంటాం.. ప్రేమించిన వ్యక్తి వేధింపులు తాళలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలను వినే ఉంటాం. తాజాగా సూర్యాపేటలో జరిగిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తి వేధింపులను తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అసలేం జరిగిందంటే...

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో నివసించేటటువంటి ఒక యువతి హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఆ యువతి తనతో పాటు చదువుకున్న బొడ్డుపల్లి వంశీతో సన్నిహితంగా ఉండేది. ఎంతో సన్నిహితంగా ఉన్న వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో కొంతకాలం నుంచి అతడిని దూరం పెట్టింది.

సదరు ఆ యువతి కుటుంబ సభ్యులు వివాహం చేయాలని నిశ్చయించారు.దీంతో అదే మండలానికి చెందిన మరొక యువకుడితో ఆ యువతికి వివాహం నిశ్చయమై నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ యువతికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలుసుకున్న వంశీ నిత్యం తనను వేధింపులకు గురి చేసేవాడు. తనతో మాట్లాడకపోతే, తనని పెళ్లిచేసుకోకపోతే వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను తన కాబోయే భర్తకు పంపిస్తానని బెదిరించేవాడు.

సదరు యువతి అతని మాటను లెక్కచేయక పోవడంతో వంశీ వాలిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను తనకు కాబోయే భర్త బంధువులలో ఒకరికి వాట్సప్ ద్వారా ఫోటోలను పంపించారు. ఈ ఫోటోలను చూసిన పెళ్ళికొడుకు తరపు వారు ఈ పెళ్లిని రద్దు చేశారు. అంతేకాకుండా వంశీ వీరిద్దరి ఫోటోలను తన స్నేహితులైన శ్రీకాంత్, నందిని, శ్యాంరెడ్డిలకు పంపగా, వారు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి 6వ తేదీ తన పిన్ని ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళింది. కొద్ది రోజులు అక్కడే ఉండి తిరిగి10 వ తన ఇంటికి వెళ్తానని చెప్పింది. అయితే రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఉదయం తన పొలంలో ఉన్న బావిలో తన కూతురు శవాన్ని చూడటంతో తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని గుర్తించారు. దీంతో ఆత్మహత్యకు కారణమైన వంశీ అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story
Share it