బైక్ ఎక్కుతుండగా.. మృత్యువు ఏ రూపంలో వచ్చిందంటే..

హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ఎక్కుతున్న ఓ మహిళను అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది

By Medi Samrat  Published on  1 Dec 2023 6:27 PM IST
బైక్ ఎక్కుతుండగా.. మృత్యువు ఏ రూపంలో వచ్చిందంటే..

హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ఎక్కుతున్న ఓ మహిళను అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన కారు నడిపింది ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడిగా తెలుస్తోంది. కాజీపేటకు చెందిన కవిత అనే మహిళ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుంచి అప్పుడే బయటికు వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తమ ద్విచక్రవాహనం ఎక్కుతున్న సమయంలో TS03 FA9881 నెంబర్ కారు వేగంతో దూసుకొచ్చి కవితను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కవితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పోలీస్ అధికారి కుమారుడే యాక్సిడెంట్ చేశాడని, పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఫాతిమా నగర్ జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story