కొండపైకి తీసుకుని వెళ్లి ఇద్దరు పిల్లలకు నిప్పంటించిన మహిళ

Woman sets her two children on fire in Kolar. కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్‌బాగల్ సమీపంలోని అంజనాద్రి కొండలపై ఓ మహిళ

By Medi Samrat  Published on  7 Dec 2022 6:45 PM IST
కొండపైకి తీసుకుని వెళ్లి ఇద్దరు పిల్లలకు నిప్పంటించిన మహిళ

ముల్‌బాగల్ (కోలార్): కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్‌బాగల్ సమీపంలోని అంజనాద్రి కొండలపై ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ ఈ ఘటనకు పాల్పడిందని స్థానికులు తెలిపారు. పిల్లలను ఆమె కావాలనే తగలబెట్టినట్లు గుర్తించారు. సంఘటనా స్థలం నుండి మండుతున్న వాసనను గమనించి అందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పిల్లలు తగలబడుతూ ఉన్నారు. మహిళ కూడా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు ఉండి ఉంటాయని భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story