ప్రియుడితో కలిసి భర్తను సుత్తితో కోట్టి చంపేసిన భార్య.. మృతదేహన్ని కారు డిక్కీలో వేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు..
Woman murders husband with lover's help, reaches police station with body in car. ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత అతన్ని ఎవరు గుర్తించకుండా ముఖాన్ని సుత్తితో పగులగొట్టింది.
By అంజి Published on 9 Dec 2021 1:20 PM ISTభోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత అతన్ని ఎవరు గుర్తించకుండా ముఖాన్ని సుత్తితో పగులగొట్టింది. భర్తను చంపే ముందు ఆ భార్య బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు భోజనం పెట్టింది. భర్తను చంపిన తర్వాత భార్య, ప్రియుడు కలిసి మృతదేహం తలని పాలీ బ్యాగ్‌తో చుట్టి గోనె సంచిలో ఉంచారు. ఆ తర్వాత కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి, మృతదేహాన్ని పారవేసేందుకు నగర శివార్లలోని అటవీ ప్రాంతాల్లో నాలుగైదు గంటల పాటు తిరిగారు. అయితే ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని గ్రహించిన వారు తమ కారులో కటారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. ధనరాజ్ మీనా (39) సెహోర్ జిల్లాకు చెందినవాడని ఏఎస్పీ రాజేష్ సింగ్ బదౌరియా తెలిపారు. సాగర్ గోల్డెన్ పామ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ధనరాజ్ సంగీతను 2006లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రియుడు శివపురిలోని కొలారస్‌కు చెందిన ఆశిష్ పాండే (32) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని ఏఎస్పీ బదౌరియా తెలిపారు. అతను తన భార్య, మైనర్ కుమార్తెతో కలిసి 2014 నుండి మరొక ఫ్లాట్‌లో అదే అంతస్తులో అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అతని భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ధన్‌రాజ్, ఆశిష్ కుటుంబాలు ఇరుగుపొరుగు వారితో పరిచయం ఉన్నట్టు ఏఎస్పీ తెలిపారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆశిష్, సంగీత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో సంగీత, ఆశిష్‌లు ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఉండటాన్ని గమనించిన ధనరాజ్‌కి గత 7-8 నెలలుగా వీరి వ్యవహారంపై ఆలోచన వచ్చింది. అతను ఆమెకు కౌన్సెలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వేర్వేరు గదులలో ఎక్కువ గంటలు ఫోన్‌లో మాట్లాడేది.
ఒక నెల క్రితం ప్రియుడు ఆశిష్, భర్త సంగీతను కలిసి ఉన్న సమయంలో వారిని భర్త ధనరాజ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత అతనికి, సంగీత మధ్య తరచుగా గొడవలు ప్రారంభమయ్యాయి. తీవ్ర పరిణామాలుంటాయని ధనరాజ్ తనను బెదిరించాడని చెప్పింది. తరచూ గొడవలు జరుగుతుండటంతో ధనరాజ్‌ను హత్య చేయాలని సంగీత ప్లాన్ చేసిందని ఏఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం భార్య సంగీత భర్త ధనరాజ్ తినే బిర్యాణీ నిద్రమాత్రలు కలిపింది. ఇంతలో ప్లాన్ ప్రకారం ఆశిష్ నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి సంగీత ఇంటికి చేరుకున్నాడు. నిద్రమాత్రలు వేసుకుని ధనరాజ్ పడక గదిలో స్పృహతప్పి పడిపోయాడు. పిల్లలు తమ గదిలో ధనరాజ్ అన్నయ్య కూతురుతో కలిసి నిద్రిస్తున్నారు.
తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య నిందితులు ధనరాజ్ కాళ్లకు కట్టేసి గొంతుకోసి హత్య చేశారు. అతనిని హత్య చేసిన తర్వాత వారు అతని గుర్తింపును దాచడానికి సుత్తి, కర్రతో అతని ముఖాన్ని పగులగొట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ధనరాజ్ మృతదేహాన్ని పారవేసేందుకు సంగీత, ఆశిష్ తమ కారులో కాలనీ నుంచి బయలుదేరినట్లు ఏఎస్పీ తెలిపారు. నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పాతిపెట్టాలని ప్లాన్ చేశారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కటారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వారు కారు డీక్కీలో మృతదేహం గురించి పోలీసులకు చెప్పారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగింది.