తల్లికి మత్తు మందు ఇచ్చి రెండున్నర నెలల బిడ్డను దారుణంగా చంపిన కసాయి మహిళ
హర్యానా రాష్ట్రం మెహమ్‌లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్‌లో ముంచి చంపింది.
By Medi Samrat
హర్యానా రాష్ట్రం మెహమ్‌లోని అజైబ్ గ్రామంలో మంగళవారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్‌లో ముంచి చంపింది. బాధిత మహిళ ప్రియాంక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఒక మహిళ వచ్చింది. ఆమెకు ఏదో తినిపించి అపస్మారక స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మహిళ ఆమె నుంచి చిన్నారిని లాక్కోవడానికి ప్రయత్నించింది. తల్లి చిన్నారిని లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఆమెను దూరంగా నెట్టివేసింది. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత మహిళ ఆ బిడ్డను డ్రమ్ములో ముంచి చంపేసింది.
బంధువులు ప్రియాంక, ఆమె కొడుకును పీజీఐలో చేర్పించారు. అయితే.. రెండున్నర నెలల చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. చిన్నారి తల్లి వాంగ్మూలం, తాంత్రిక విద్యతో పాటు ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు మెహమ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సత్యపాల్ తెలిపారు.
ప్రియాంక పీజీఐలో చేరింది. అజైబ్ గ్రామానికి చెందిన ప్రియాంక అలియాస్ ఖుష్బూ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్నానని.. ఆ సమయంలో సదరు మహిళ వచ్చి ఈ నేరానికి పాల్పడిందని తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక పీజీఐఈఎంఎస్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాతే నేరానికి పాల్పడిన మహిళ ఎవరనేది కచ్చితంగా తెలుస్తుంది. గ్రామ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.
అజైబ్ గ్రామంలో నివాసం ఉంటున్న మోహిత్ ప్రజాపత్ జులానాలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్నాడు. మోహిత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత ఎన్నో రోజులకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆ సంతోషాన్ని విషాదంగా మార్చింది. మోహిత్ తల్లి అంగన్‌వాడీలో పనిచేస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆమె కూడా ఇంట్లో లేరు. ఇంట్లో తల్లి, కొడుకు మాత్రమే ఉన్నారు. సర్పంచ్ ధర్మేంద్ర మాట్లాడుతూ.. వారి కుటుంబం ఎంతో గౌరవప్రదమైన కుటుంబమన్నారు. హంతకులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.