ముస్లీం స్త్రీల‌ను వేలం వేస్తున్నట్టు ప్ర‌క‌ట‌న‌లు.. ఓ మహిళ అరెస్ట్‌

Woman Mastermind Behind Bullibai App Detained in Uttarakhand Mumbai Police. 'బుల్లి బాయి' యాప్‌కు సూత్రధారిగా భావిస్తున్న ఓ మహిళను ముంబై

By Medi Samrat  Published on  4 Jan 2022 1:59 PM GMT
ముస్లీం స్త్రీల‌ను వేలం వేస్తున్నట్టు ప్ర‌క‌ట‌న‌లు.. ఓ మహిళ అరెస్ట్‌

'బుల్లి బాయి' యాప్‌కు సూత్రధారిగా భావిస్తున్న ఓ మహిళను ముంబై పోలీసులు మంగళవారం ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. "ఉత్తరాఖండ్‌లోని ముంబై పోలీసుల సైబర్ సెల్ ఒక మహిళను అదుపులోకి తీసుకుంది. యాప్ వెనుక ప్రధాన సూత్రధారి ఆమెనే అని తెలుస్తోంది. ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ కోసం ఉత్తరాఖండ్‌లోని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత, ఆమెను ముంబై తీసుకురానున్నారు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రకటిస్తూ వచ్చారు. మహిళల ఫొటోలు అప్‌లోడ్‌ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ ప్రకటనలు ఇస్తున్న 'బుల్లీ బాయ్‌' అనే యాప్‌ వ్యవహారం గురించి మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బుల్లీ బాయ్‌ యాప్‌ బాధితుల్లో ముస్లిం మతానికి చెందిన వందలాది మంది మహిళలు, విద్యార్థినులు, ప్రముఖులు, జర్నలిస్టులు ఉన్నారు. అభ్యంతరకరమైన కంటెంట్ ఫిర్యాదుల నేపథ్యంలో వివాదాస్పద యాప్ బుల్లి బాయిని హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్ గిట్ హబ్ బ్లాక్ చేసింది.

ఈ పోర్టల్ జనవరి 1, శనివారం ప్రారంభించబడింది. అనేక ముస్లిం మహిళల చిత్రాలను కలిగి ఉంది, అవమానకరమైన కంటెంట్‌ కూడా ఉంది. పోర్టల్ లో అనుచితమైన, ఆమోదయోగ్యం కాని కంటెంట్ ఉందని పలువురు ఆరోపించారు. 'బుల్లి బాయి' యాప్‌లో చిత్రాలను అప్‌లోడ్ చేయడం గతేడాది జూలైలో వివాదానికి కారణమైన 'సుల్లి డీల్స్' అప్‌లోడ్ మాదిరిగానే ఉంది. 'బుల్లి బాయి' యాప్ సుల్లి డీల్స్ చేసిన విధంగానే పని చేసింది. గత ఏడాది సుల్లి డీల్స్ ఘటనలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు నేరస్థులపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు. 'బుల్లీ బాయి' యాప్‌ కు సంబంధించి దోషులను అరెస్టు చేయడంతో సహా చర్యల కోసం ముంబై పోలీసులతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. ఈ యాప్‌ను ట్విట్టర్ హ్యాండిల్ @bullibai ప్రచారం చేస్తోంది, ఇది "ఖల్సా సిక్కు ఫోర్స్" ద్వారా నిర్వహించబడుతుందని తెలుస్తోంది.

'బుల్లి బాయి' యాప్ లో వేలం వేస్తున్న మహిళల ఫొటోల్లో తనది కూడా అప్ లోడ్ చేశారంటూ ఆయేషా మినాజ్ అనే మహిళా పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఈ యాప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్లి బాయి అనే యాప్‌లో వేలానికి అప్‌లోడ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ముంబై సైబర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోటో అప్‌లోడ్ చేయబడిన ఓ జర్నలిస్టు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొన్ని గంటల్లోనే ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు.


Next Story