పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ అనగానే ఒప్పుకుంది.. తీరా చూస్తే..!

కోయంబత్తూరులోని వడవల్లిలో నివాసముంటున్న 34 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ మోసానికి గురై 4.63 లక్షల రూపాయలను కోల్పోయింది.

By Medi Samrat  Published on  30 March 2024 3:00 PM GMT
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ అనగానే ఒప్పుకుంది.. తీరా చూస్తే..!

కోయంబత్తూరులోని వడవల్లిలో నివాసముంటున్న 34 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ మోసానికి గురై 4.63 లక్షల రూపాయలను కోల్పోయింది. బాధితురాలిని ప్రీతిగా గుర్తించారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెను మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి.. పార్ట్‌టైమ్ జాబ్ అవకాశాన్ని ఇస్తామని చెప్పాడు. బాగా డబ్బులు కూడా వస్తాయని చెప్పడంతో ఆ మహిళ అతడి మాటలకు ఆకర్షితురాలైంది. వివిధ కంపెనీలకు సంబంధించి గూగుల్‌లో రివ్యూలు రాయాల్సిన బాధ్యత మీదేనంటూ ప్రీతికి తెలిపాడు. పెట్టుబడి పెడితే బాగా డబ్బులు వస్తాయని వాగ్దానం చేశాడు. డబ్బును పెట్టుబడి పెట్టమని ఆమెను ప్రలోభపెట్టాడు. అపరిచితుడి హామీలను నమ్మి, ప్రీతి పలు లావాదేవీల ద్వారా 4.63 లక్షల రూపాయలను వ్యక్తి ఖాతాకు బదిలీ చేసింది.

ప్రీతి పెట్టుబడికి తగ్గ రాబడి రాలేదు. అలాగే మోసగాడి నుండి మరిన్ని డిమాండ్లు ఎదురయ్యాయి. దీంతో ఆమె మోసపోయానని గ్రహించింది. స్కామ్‌ను వెంటనే గుర్తించిన ప్రీతి కోయంబత్తూర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆన్‌లైన్ మోసగాడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420, మోసానికి సంబంధించిన సెక్షన్‌లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66డి కింద కేసు నమోదు చేశారు.

Next Story