తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 4 Feb 2026 2:24 PM IST

Crime News, Telangana, Rangareddy District, Kethireddypally, Property Dispute, Woman Lawyer Murdered

తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా స్వప్న అనే యువ న్యాయవాదిని ఆమె సోదరుడే రాజు దారుణంగా హత్యచేశాడు. పొలం వద్ద సర్వే జరుగుతుండగా ఆమె అన్న స్వప్నను అత్యంత కర్కశంగా హతమార్చాడు. మృతురాలు స్వప్న చేవేళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ హత్యను నిరసిస్తూ చేవేళ్ల కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story