దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తీసుకురాలేదని కొడుకును కొట్టి చంపిందో ఓ మహిళ. చెంబూర్ ప్రాంతంలో తన కోసం మద్యం తీసుకురాలేదని తన కొడుకును 52 ఏళ్ల మహిళ సుత్తితో కొట్టి చంపినందుకు మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బయటకు వెళ్లిన తన కొడుకు మద్యం తీసుకురాలేదని తల్లి లూర్త్‌ మేరీ కొడుకు ప్రవీణ్‌తో వాగ్వాదానికి దిగింది. శనివారం అర్థరాత్రి వాషినాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఆర్‌సిఎఫ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

"మొదట ప్రవీణ్ తల్లిని కొట్టాడు, ఆపై ఆమె అతని తలని సుత్తితో పగులగొట్టింది. ఆ తర్వాత ఆమె ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు తన కొడుకు తప్పిపోయాడని.. అతని కోసం వెతుకుతానని ఓ స్నేహితుడికి చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె మాన్‌ఖుర్డ్‌లోని బంధువుల ఇంటికి చేరుకుంది. ఆమె భర్తకు కొడుకు తప్పిపోయాడని చెప్పింది. అయితే, ఆమె భర్తకు అనుమానం వచ్చింది. సోమవారం మధ్యాహ్నం, దంపతులు తమ ఇంటికి చేరుకున్నారు. కొడుకు ప్రవీణ్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story