దుర్గం చెరువులోకి దూకి మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

Woman jumps into Durgam Cheruvu lake. కేబుల్‌ స్టేడ్‌ వంతెనపై నుంచి దుర్గం చెరువులోకి దూకి గుర్తు తెలియని

By Medi Samrat  Published on  30 July 2022 9:15 PM IST
దుర్గం చెరువులోకి దూకి మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

కేబుల్‌ స్టేడ్‌ వంతెనపై నుంచి దుర్గం చెరువులోకి దూకి గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ముప్పై ఏళ్ల వయస్సు ఉన్న మ‌హిళ‌ పాదచారుల నడక మార్గానికి చేరుకున్న‌ తర్వాత చెరువులోకి దూకింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందం సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.







Next Story