క్ష‌ణికావేశం.. 8నెల‌ల పాపతో భ‌వ‌నం పై నుంచి దూకిన త‌ల్లి

Woman jumps from Building in Jubilee hills.భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిన్న త‌గాదా. క్ష‌ణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా.. ఓ నిండు ప్రాణం పోగా.. 8 నెల‌ల చిన్నారి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2021 11:35 AM IST
Woman jumps from Building in Jubilee hills

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిన్న త‌గాదా. క్ష‌ణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా.. ఓ నిండు ప్రాణం పోగా.. 8 నెల‌ల చిన్నారి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని జూబిహిల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బీహార్‌కు చెందిన భీమల్ కుమార్, ఆర్తి(22) భార్య భార్తలు. వీరికి 8 నెలల పాప ఉంది. కొద్దికాలం క్రిత‌మే హైద‌రాబాద్‌కు వ‌చ్చి జూబ్లిహిల్స్‌లోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. బిమ‌ల్‌కుమార్ వంట‌మ‌నిషిగా ప‌నిచేస్తున్నాడు. కొంత‌కాలంగా ఆదంప‌తుల మ‌ధ్య చిన్న చిన్న త‌గాదాలు జ‌రుగుతున్నాయి.

రోజు మాదిరిగానే సోమ‌వారం రాత్రి కూడా విధులు ముగించుకుని వ‌చ్చాడు భీమ‌ల్‌కుమార్‌. భోజ‌నం చేసే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. ఆ గొడ‌వ‌కాస్త పెద్ద‌దిగా మారింది. ఈ క్ర‌మంలో భార్య‌పై చేయిచేసుకున్నాడు భీమ‌ల్‌కుమార్‌. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్తి.. త‌న కూతురిని తీసుకుని బ‌య‌ట‌కు వెలుతూ.. బ‌య‌ట నుంచి త‌లుపుకు గ‌డియ వేసింది. అనంత‌రం తాము ఉంటున్న భ‌వనం రెండో అంత‌స్తు నుంచి కింద‌కు దూకేసింది. త‌ల్లీ కూతుళ్ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ.. ఆర్తి మృతిచెందింది. చిన్నారి ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story