జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది

మహారాష్ట్రలోని ఓ మహిళ మెట్లపై కూర్చొని ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది

By Medi Samrat
Published on : 17 July 2024 5:28 PM IST

జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది

మహారాష్ట్రలోని ఓ మహిళ మెట్లపై కూర్చొని ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. డోంబివాలిలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. భవనంలో క్లీనర్‌గా పనిచేసిన గుడియా దేవి.. మెట్లకు పక్కనే ఉన్న గోడపై కూర్చోవడం చూడవచ్చు. కొన్ని సెకన్ల తర్వాత.. ఆమె సహోద్యోగి అయిన ఒక వ్యక్తితో మాట్లాడుతూ బిగ్గరగా నవ్వింది. అంతే ఒక్కసారిగా వారిద్దరూ అక్కడి నుండి కిందకు జారిపడ్డారు. ఆ వ్యక్తి ఎలాగోలా గోడను పట్టుకోగా గుడియా దేవి మాత్రం మూడో ఫ్లోర్ నుండి కిందకు పడిపోయింది.

ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. గుడియా దేవి మూడవ అంతస్తు నుండి పడిపోయిన వెంటనే, భవనంలోని సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ఆమెను చూసేందుకు పరుగెత్తటం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

Next Story