మత్తు మందు ఇచ్చి.. 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్‌.. మధ్యలో స్పృహ రావడంతో..

Woman given spiked drink, gang raped after birthday party. పుట్టినరోజు వేడుకులకు వెళ్లిన యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

By అంజి  Published on  17 Aug 2022 4:18 PM IST
మత్తు మందు ఇచ్చి.. 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్‌.. మధ్యలో స్పృహ రావడంతో..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌ జిల్లాలోని మోదీనగర్‌ పట్టణంలో జరిగింది. పుట్టినరోజు వేడుకులకు వెళ్లిన యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి.. ఆదివారం నాడు ఓ బర్త్‌ డే పార్టీకి హాజరైంది. అక్కడ ఆమెకు ఓ వ్యక్తి మత్తమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి రమ్మన్నాడు.

ఆ త‌ర్వాత వంతులవారీగా యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్న యువతి.. వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. నిందితులు యువతిని కొట్టి, జరిగిని విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసు అధికారి తెలిపారు. అయితే ఆ యువ‌తి ఇంటికి వెళ్లి త‌న కుటుంబానికి జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. తండ్రితో క‌లిసి ఆ యువ‌తి మోదీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి పంపగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. శేఖర్, కృష్ణ, అర్జున్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఇరాజ్ రాజా తెలిపారు.

Next Story