దారుణం.. ఏలూరు జిల్లాలో ఉప్పెన సినిమా సీన్ రిపీట్

Woman Father attacked a young man in Eluru District.ఏలూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌న కుమారై వెంట ప‌డుతున్నాడ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 12:04 PM IST
దారుణం.. ఏలూరు జిల్లాలో ఉప్పెన సినిమా సీన్ రిపీట్

ఏలూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌న కుమారై వెంట ప‌డుతున్నాడ‌ని ఓ యువ‌తి తండ్రి యువ‌కుడి మ‌ర్మాంగం పై రోకలిబండతో దాడి చేశాడు. కాస్త ఆల‌స్యంలో వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న చాట్రాయి మండలం నరసింహరావు పాలెంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. నరసింహరావు పాలెంలో సింగ‌పం శ్రీకాంత్ (24) అనే యువ‌కుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువ‌తిని ప్రేమ ప్రేమ‌తో వెంట‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని యువ‌తి.. త‌న తండ్రి జాన్‌కు చెప్పింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన జాన్‌.. మాట్లాడే ప‌ని ఉంద‌ని శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించాడు. చీక‌టి గ‌దిలో బంధించాడు. అనంత‌రం చిత్ర హింస‌ల‌కు గురి చేయ‌డ‌మే కాకుండా.. యువ‌కుడి మ‌ర్మాంగంపై రోక‌లి బండ‌తో దాడి చేశాడు. దీంతో యువ‌కుడి మ‌ర్మాంగం చిద్ర‌మైంది. తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో శ్రీకాంత్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు.

స్థానికులు ఆ యువ‌కుడిని 108 వాహ‌నంలో తొలుత ఖమ్మం ఆసుపత్రికి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడుకు, అక్కడినుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ కుమారుడి ప‌రిస్థితి చూసి అత‌డి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. యువ‌తి తండ్రి జాన్ ప‌రారీలో ఉన్నాడు. అత‌డి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు.

Next Story