గేదె తోక పట్టుకుని నది దాటుతున్న మ‌హిళ‌.. మధ్యలో ఊహించ‌ని విషాదం..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గేదె తోక పట్టుకుని మన్వార్ నదిని దాటుతున్న ఓ మహిళ నీటిలో మునిగిపోయింది.

By -  Medi Samrat
Published on : 18 Sept 2025 9:20 PM IST

గేదె తోక పట్టుకుని నది దాటుతున్న మ‌హిళ‌.. మధ్యలో ఊహించ‌ని విషాదం..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గేదె తోక పట్టుకుని మన్వార్ నదిని దాటుతున్న ఓ మహిళ నీటిలో మునిగిపోయింది. సిస్వా గ్రామానికి చెందిన సురసత గురువారం మధ్యాహ్నం గేదెలను మేపేందుకు కేశ్వా ఘాట్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమె గేదె తోక పట్టుకుని మన్వర్ నదిని దాటడం ప్రారంభించింది. వాగు మధ్యలోకి రాగానే గేదె కూర్చుంది. దీంతో సురసత తోకపై ప‌ట్టును కోల్పోయి నీటిలో మునిగింది.

దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించిన పోలీసులు నదిలోంచి సురసత మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త మహారాష్ట్రలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

మరోవైపు కౌరియాలోని గ్రామపంచాయతీ జగదీష్‌పూర్ బల్దికి చెందిన రంజాన్ అలీ అనే వ్య‌క్తి కుట్టు ప‌ని కోసం కౌరియా మార్కెట్ దుకాణానికి బైక్‌పై వెళ్తున్నాడు. బెల్వా భాన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అత‌డిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రూపాయిడిహ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అతన్ని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న బాబు ఈశ్వర్ శరణ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ రంజాన్‌ అలీ మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే తల్లి జైతీవా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మృతుడు ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడు.

Next Story