Video : భర్తకే కాదు.. భర్త తల్లికి కూడా రక్షణ లేదు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడిని ఆ వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితక్కొట్టారు.

By Medi Samrat
Published on : 5 April 2025 6:30 PM IST

Video : భర్తకే కాదు.. భర్త తల్లికి కూడా రక్షణ లేదు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడిని ఆ వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితక్కొట్టారు. ఏప్రిల్ 4న జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డైంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశాల్ బాత్రా భార్య నీలికా తన 70 ఏళ్ల అత్తను సరళా బాత్రాను ఇంటి నుండి వెళ్లగొట్టి వృద్ధాశ్రమానికి పంపాలని ఒక సంవత్సరం నుండి అతనిపై ఒత్తిడి తెస్తోంది. అయితే విశాల్ తన తల్లి ఆరోగ్యం కారణంగా అందుకు నిరాకరించాడు. దీని వల్ల వారి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

ఈ విషయమై నీలికా తన తండ్రి, సోదరుడిని వారి ఇంటికి పిలిపించి గొడవ మరింత పెద్దది చేసింది. పరిస్థితి మరింత దిగజారింది. నీలికా సోదరుడు విశాల్ పై శారీరకంగా దాడి చేశాడు, అతని తల్లి సరళను జుట్టు పట్టుకుని లాగి, నేలపై పడేసి, నీలికా ఆమెపై అనేకసార్లు కొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. తన కోడలు చాలా రోజులుగా తనను వేధిస్తూ ఉందని, తన కొడుకును ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని సరళా బాత్రా చెప్పారు. ప్రాణభయంతో విశాల్, అతని తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నీలికా తండ్రి, సోదరుడు పోలీస్ స్టేషన్ లోపల కూడా తమను చంపుతామని బెదిరించారని వారు ఆరోపించారు.


Next Story