భర్త వేధింపులు.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Woman Commits Suicide after throws her children from building at Bansilalpet in Hyderabad. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్ప‌డింది.

By Medi Samrat
Published on : 19 Jun 2023 6:38 PM IST

భర్త వేధింపులు.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్ప‌డింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సీలాల్ పేటలో ఘటన జరిగింది. భర్త గణేష్ వేధింపులు తాళలేక సౌందర్య అనే మహిళ తన కవల పిల్లలు నిదర్శన్, నిత్యలతో స‌హా తన తల్లి నివాసం ఎనిమిదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్ప‌డింది. అనునిత్యం భర్త అందంగా లేవని అన‌డం.. అద‌న‌పు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేయ‌డంతో సౌందర్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుప‌త్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story