వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లైన 16 రోజులకే అత్తారింట్లో ఉరివేసుకుని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. నవ వధువు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవళి(22)కి వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 16 రోజుల క్రితం వివాహాం అయింది. తనకు ఇష్టం లేని పెళ్లిచేశారంటూ సూసైట్ నోట్ రాసి అత్తిరింటిలోనే సోమవారం రాత్రి రవళి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. "నా చావుకు ఎవరూ కారణం కాదు. అమ్మా నీకు తెలుసు. కులం, మతం చూడొద్దు. భర్తకు క్షమాపణ చెబుతున్నా. "సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.
ఆత్మహత్య చేసుకునే ముందు రవళి తాళిబొట్టును తీసి డ్రెస్సింగ్ టేబుల్ పై పెట్టి దాని కింద సూసైడ్ లెటర్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లై 15 రోజులు కూడా గడవకముందే నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.