రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణంలో ఇంట్లో జరిగిన గొడవలో భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోపంతో ఒక మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికిందని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 115(2), 118(2) కింద గాయపరిచినందుకు రవినా సైన్ (23)పై కేసు నమోదు చేశారు పోలీసులు.
బకానీ పట్టణానికి చెందిన కన్హయాలాల్ సైన్ (25) మరియు సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవినా సైన్ ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా గొడవలు పడుతూనే ఉన్నారు. ఈసారి గొడవ మరింత పెద్దదైంది. ఆ మహిళ ఆవేశంతో కన్హయాలాల్ నాలుకలో కొంత భాగాన్ని కొరికిందని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులు కన్హయాలాల్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతన్ని ఝలావర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారని, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. నాలుకను తిరిగి అతికించవచ్చని వైద్యులు తెలియజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సంఘటన తర్వాత, రవినా సైన్ ఒక గదిలోకి ప్రవేశించి కొడవలితో తన మణికట్టును కోసుకోవడానికి ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు.