ప్రేమ పెళ్లి.. భర్త చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచర్‌గా మారిన యువతి

భర్త చేసిన అప్పులు తీర్చడానికి ఓ భార్య దొంగగా మారింది. బీటెక్‌ చదివి, చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేసి చివరికి హైదరాబాద్ లో దొంగతనాలకు తెగబడింది.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 11:20 AM IST

ప్రేమ పెళ్లి.. భర్త చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచర్‌గా మారిన యువతి

భర్త చేసిన అప్పులు తీర్చడానికి ఓ భార్య దొంగగా మారింది. బీటెక్‌ చదివి, చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేసి చివరికి హైదరాబాద్ లో దొంగతనాలకు తెగబడింది. మియాపూర్‌కు చెందిన నల్ల కమల్‌ అనే వృద్ధురాలు అవంతినగర్‌ తోట కాలనీలోని తన ఇంటికి వచ్చి పైఅంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కింది. లిఫ్ట్‌ తలుపులు మూసుకోక ముందే అక్కడ ఉన్న ఓ మహిళ లోపలికి చెయ్యిపెట్టి వృద్ధురాలి మెడలోని మంగళసూత్రం, నల్లపూసల గొలుసు తెంపేందుకు యత్నించింది. బాధితురాలు కేకలు వేయడంతో చేతికందిన అర తులం నల్లపూసల గొలుసు తెంచుకుని పారిపోయింది. సనత్‌నగర్‌ పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలు అనితారెడ్డిని పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన అనితారెడ్డికి మేడ్చల్‌కు చెందిన రాజేష్‌తో రెండేళ్ల కిందట ప్రేమ పెళ్లి జరిగింది. వీరికి కుమార్తె ఉంది. తొలుత ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేసిన రాజేష్‌ ఆ తరువాత పని మానేశాడు. అప్పులు చేశాడు. అప్పు కారణంగా భర్త తరచూ బాధపడుతుండటంతో తాను ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది.

Next Story