స్నేహితురాలనుకుని నమ్మి ఇంట్లోకి రాణిస్తే చోరీకి పాల్పడింది. అయితే సీసీటీవీ కెమెరాలు ఉండడంతో అడ్డంగా దొరికిపోయింది. నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో గాయత్రి అలియాస్ గౌతమి అనే మహిళ బ్యూటీ పార్లర్లో పని చేస్తుంది. ఆ ఇంటి యజమానితో గౌతమికి పరిచయం ఏర్పడింది. అయితే ఆమె డూప్లికేట్ తాళం చేయించి తన దగ్గర పెట్టుకుంది.
ఇక సమయం చూసుకుని యజమాని ఇంట్లో లేని సమయంలో ఆమె ఆటలు మొదలయ్యాయి. సదరు మహిళ డబ్బులు దొంగిలిస్తూ ఉండేది. తరుచూ డబ్బులు కనిపించకుండా పోవడాన్ని ఇంటి యజమాని గుర్తించాడు. అసలు దొంగ ఎవరో కనుక్కోడానికి స్పై కెమెరా అమర్చాడు. అప్పుడే మరోసారి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది గాయత్రి. 18 తులాల బంగారం 1.30 కిలోల వెండి, కొంత నగదు అపహరణ గురైంది. ఆ మహిళ చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు