క్యాబ్ డ్రైవర్ సహాయంతో.. శిశువులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్‌

With cab driver's help, Police arrests 3 for trafficking infants in Gurugram . క్యాబ్ డ్రైవర్ సహాయంతో, గురుగ్రామ్ పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో రూ.3-4 లక్షలకు శిశువుల అక్రమ రవాణాకు

By అంజి  Published on  10 Jan 2022 8:58 AM GMT
క్యాబ్ డ్రైవర్ సహాయంతో.. శిశువులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్‌

క్యాబ్ డ్రైవర్ సహాయంతో, గురుగ్రామ్ పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో రూ.3-4 లక్షలకు శిశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గురుగ్రామ్‌ నగర పోలీసులు శనివారం 20-25 రోజుల వయస్సు గల ఇద్దరు శిశువులను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఠా సభ్యులు ఢిల్లీ నుండి శిశువులను దొంగిలించి, పొరుగు రాష్ట్రాల్లో రూ.3-4 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠా సభ్యులు 2014 నుండి నవజాత శిశువుల అక్రమ రవాణా చేస్తున్నారు. నిందితులు హర్యానాలోని అల్వార్ ప్రాంతంలో రూ. 3 లక్షల విలువైన డీల్‌ను కూడా ఖరారు చేశారు. ఇది చెల్లింపు విషయంలో విభేదాల కారణంగా ఆగిపోయింది. ఏసీపీ క్రైమ్ ప్రీత్‌పాల్ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. ''మేము నిందితుల సహచరుల గురించి వారిని ప్రశ్నిస్తున్నాము. వారు వ్యవస్థీకృత సిండికేట్‌లో భాగమైనట్లు, అనేక మంది వ్యక్తులు ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

అరెస్టయిన వ్యక్తులను సురీందర్ కౌర్, నేహా కుమార్, హర్జిందర్ సింగ్‌లుగా గుర్తించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు అల్వార్‌కు చెందినవారు కాగా, ఒకరు ఢిల్లీకి చెందినవారు. మహిళలు ఇద్దరూ పసికందులను తీసుకుని అల్వార్ వద్దకు వెళ్లి రూ. 4,000 చెల్లించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాబ్ డ్రైవర్ (ఉమేష్ లోహియా) వారు చాట్ చేయడం, ఒప్పందాన్ని ఖరారు చేయడం విన్నారు. అతను ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. డీఎల్‌ఎఫ్‌ ఫేజ్ 3 మెట్రో స్టేషన్ సమీపంలోని పోలీస్ స్టేషన్ వైపు వెళ్లాడు. లోహియా ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 370 (5) (వ్యక్తుల అక్రమ రవాణా), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలీసు కమిషనర్ క్యాబ్ డ్రైవర్‌కు రూ. 25,000, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు.

Next Story
Share it